చింతామణి ప్రశ్నలు

మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను ప్రశ్నల రూపంలో పొందుపరచడం జరిగింది. వీటినే చింతామణి ప్రశ్నలు అంటారు.

సమాదానాలు ఉచితంగా పొందుటకు
రెండు పద్దతులు పాటించాలి.

1వ పద్దతి :

ఫ్రీ రిజిస్ట్రేషన్ (SignUp) చేసుకొని, లాగిన్ (LogIn)అయ్యాక, మీకు కావలసిన అంశాన్ని ఎన్నుకోవాలి (ఉదా: విద్య, ఉద్యోగం... ) అందులో మీకు కావలిసన ప్రశ్నలు ఉంటాయి. వాటిని ఎన్నుకోవాలి.

2వ పద్దతి :

మనసులో మీ ఇష్టదైవాన్ని ప్రార్ధించి 1 నుండి 108 లోపు (3) మూడు అంకెలు ఇవ్వాలి లేదా 1 నుండి 108 చీటీలు తయారు చేసి నెంబర్లు రాసి ఒక బాక్స్ లో వేసి దేవుడి పటం ముందు ఉంచి ప్రార్థించి మూడు చీటీలను తీయండి వచ్చిన నెంబర్లను ఇవ్వడం ద్వారా సమాధానాలు పొందవచ్చు.
ఉదా : 10, 29, 103

(చింతామణి ప్రత్యేక ఇదే - మీరు కేవలం ప్రశ్న సంఖ్య మరియు అంకెలు (1 నుండి 108 లోపు 3 అంకెలు) చెపితే మీరు మనసులో కోరుకున్న ప్రశ్న దానికి సమాదానం చెప్పడం జరుగుతుంది)


పాఠించవలసిన నియమాలు :

1. పృచ్చకుడు ( ప్రశ్న అడిగేవారు) శుచి శుభ్రతగా ఉండి ప్రశ్న అడుగవలెను.
2. దైవం పైన, జ్యోతిష్యం పైన నమ్మకం కలిగి ఉండవలెను. నమ్మకంతో ప్రశ్న అడిగితే మంచి ఫలితం ఉంటుంది.
3. ఏదో సరదాకో, నిజమా కాదా అని తెలుసుకొనుటకో ప్రశ్న అడుగవద్దు. అలా అడిగిన ఫలితం ఉండదు.
4. నిర్మలమైన మనసుతో ఇష్టదైవాన్ని ప్రార్థించి ప్రశ్న అడుగవలెను.
5. సుముహూర్తం (మంచి సమయం) లో (రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం ఇవి కాకుండా మిగిలిన సమయం) అడుగవలెను.
6. ఒక సారి ఇచ్చిన నెంబర్లు మళ్ళీ మళ్లీ అవే ఇవ్వకూడదు. లేదా చీటీల పద్దతిలో నెంబర్లు ఇచ్చి ప్రశ్న అడగండి. మంచి ఫలితం ఉంటుంది.
7. నెగిటివ్ సమాధానం వస్తే కుంగిపోకుండా వాటికి తగిన రెమిడీస్ పాటించండి. రెమిడీస్ కోసం మీ దగ్గరలోని మంచి పూజారిని సంప్రదించండి.
8. నెగిటివ్ జీవితాన్ని మార్చుకునేందుకే ఈ సైట్ రూపొందించడం జరిగింది.
9. ఒక రోజు మూడు ప్రశ్నమాత్రమే అడుగవలెను.
10. వేరొకరికోసం అయితే ఒక్కొక్కరికి 3 ప్రశ్నల చొప్పున ఎన్ని ప్రశ్నలు అయినా అడుగవచ్చును.
11. సైట్ లో వివరించిన అంశాలను క్షుణ్ణంగా చదవి అర్ధం చేసుకోండి.

సందేహాలు- సమాదానాలు :

1. చింతామణి ప్రశ్నలు అంటే ఏమిటి ?

స: మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను ప్రశ్నల రూపంలో ( ప్రశ్న సంఖ్య 1 నుండి 313 వరకు) పొందుపరచడం జరిగింది. వీటినే చింతామణి ప్రశ్నలు అంటారు. ప్రశ్నలు అడిగే వారిని పృచ్చకులు అంటారు.

2.చింతామణి ప్రశ్నలు ఎలా అడగాలి ?

స: ప్రశ్న అడిగే విధానము (1వ పద్దతి, 2వ పద్దతి) చూడండి.

3.chintaamani.co.in ఉపయోగం ఏమిటి ?

స: ఇంటర్ నెట్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఈ వెబ్ సైట్ ద్వారా ప్రశ్నఅడిగితే మీరెవరో తెలియక పోయిన, మీ మనసులో ఏ ప్రశ్న అనుకున్నారో తెలియకపోయినా, మీరు అడిగే ప్రశ్న దానికి సమాధానం ఉచితంగా వెంటనే పొందవచ్చు.

4.అంకెలు 1 నుండి 108 లో మాత్రమే ఎందుకు ఇవ్వాలి ?

మనకు 12 రాశులు, 9 గ్రహాలు ఉన్నాయి. (12x9=108) వీటి మొత్తం 108 వస్తుంది. అలాగే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.((27x4=108) వీటి మొత్తం కూడా 108 వస్తుంది. మన హిందూ శాస్త్రంలో 108 (అష్టోత్తర శత) కి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చిన 3 అంకెలు ఈ 108 లోపల ఉండడం ద్వారా ఒక లగ్నం ఏర్పడుతుంది. (మనకు రాశులలాగే అవే పేర్లతో 12 లగ్నాలు ఉన్నాయి). మీ సమాధానం ఆ లగ్నంలో పడుతుంది. తద్వారం మీకు సమాధానం లభిస్తుంది.

5. ఫోన్ చేసి అడుగవచ్చా ?

స: ఫోన్ చేసి అడుగరాదు, ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వడము ద్వారా సమాధానలు వెంటనే ఉచితంగా పొందవచ్చను.

6.ఏ వయస్సు వారు ప్రశ్న అడుగవచ్చ ?

స: వయోబేదం లేదు, చిన్నా పెద్ద ఏ వయస్సు వారైనా ప్రశ్న అడుగవచ్చు.

7.ఇ-మేయిల్ చేయవచ్చా ?

స: మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో ఏ భాషలోనైనా ఇ-మెయిల్ చేయవ్చు.

8.చింతామణి ద్వారా నా జాతకం తెలుసుకోవచ్చా ?

స: ఇది ప్రశ్నా జాతకం, మీరు ఎన్నుకునే ప్రశ్నవరకే మీకు సమాధానం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అంటే జిరిగితే జరుగుతుంది లేదా జరగకపోతే లేదు అని చెప్పడం. పూర్తి గా జాతక పరిశీలన (జన్మకుండలి, నవాంశ) కావాలంటే మీ పుట్టిన తేది, సమయం, జన్మ స్థలం వివరాలతో ఫోన్ లో మమ్మలను సంప్రదించవచ్చు. దీనికోసం ముందుగా కన్సల్టేషన్ తీసుకోవలసి ఉంటుంది. వివరాలకు కాంటాక్ట్ పేజీ లో ఫోన్, వాట్సప్ నెంబర్ ఉంటుంది.

9. నా మనస్సులో కోరుకున్న ప్రశ్నకు సమాధానం తప్పుగా వచ్చింది. నేను కోరుకున్న సంఖ్య వేరు

స: పశ్న అడగడం కోసం వెబ్ సైట్ లో ఇచ్చిన అంశాలపై అవగాహన వచ్చాకే ప్రశ్న అడగండి. మీరు ఇచ్చే సంఖ్య ద్వారానే మీ ప్రశ్న, దానికి సమాధానం వస్తుంది. (మేము ఎందరినో పరీక్షించిన తరువాతనే ఈ వెబ్ సైట్ రూపొందించడం జరిగినది)

10. రెమిడీస్ అంటే ఏమిటి ?

రెమిడీస్ : పూజలు, వ్రతాలు, గ్రహ దోష నివారణలు, దానధర్మాలు, హోమాలు, యగ్నయాగాలు, గ్రంధపారాయణాలు, నిత్యం భగవస్మరణ, తీర్థయాత్రలు, పుణ్య నదీస్నానాలు, తరుచూ దేవాలయ సందర్శణలు ఇలా శక్తిఅనుసారము చేసినచో మంచి ఫలితములు లభించును.

11. ఉచితంగా సమాధానాలు చెబుతున్నారు. నిజమని నమ్మవచ్చా ?

స: అవునండి, ఉచితం అనగానే చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. ఎందుకంటే ఉచితం పేరు చెప్పి ఎంతోమంది మోసం చేస్తున్నారు. అలా అని అందరు అలాగే వుండరు కదా, ఉదా : మీరు గుగూల్ సెర్చ్ ఇంజన్ వాడుతున్నారు, ఇది ఉచితమే కదా, అదే విధంగా జీమెయిల్, యాహూ మెయిల్ కూడా ఉచితమే కదా అందులో ఏమైనా మోసం వుందా, ఒకటి ఆలోచించండి, మేము మిమ్ములను ఏమైనా డబ్బులు అడుగుతున్నామా, మీ ఎకౌంట్ డిటేల్స్ ఏమైనా అడుగుతున్నామా, మరి అలాంటప్పడు సందేహపడవలసిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలు కూడా ఉచితంగా సర్వీస్ ను అందిస్తన్నాయి. అదే విధంగా చింతామణి.కో.ఇన్ కూడా పనిచేస్తంది. మాకు ఆర్ధిక ఆధాయ మార్గలు వేరే ఉన్నాయి, సందేహపడవలసిన అవసరం లేదు.

ఇతర సందేహాలు ఏమైన ఉంటే మాకు ఇ-మెయిల్ చేయండి.
మా ఇ-మెయిల్ ఐడి chintaamani4all@gmail.com

చింతామణి ప్రత్యేకతలు

మొదటి ప్రత్యేకత

మీరు కేవలం అంకెలు(పదకం, 108 లోపు 3 అంకెలు)చెపితే మీరు మనసులో కోరుకున్న ప్రశ్న దానికి సమాదానం చెప్పడం జరుగుతుంది)

రెండవ ప్రత్యేకత

ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఈ వెబ్ సైట్ ద్వారా ప్రశ్నఅడిగితే మీరెవరో తెలియక పోయిన, మీ మనసులో ఏ ప్రశ్న అనుకున్నారో తెలియకపోయినా, మీరు అడిగే ప్రశ్న దానికి సమాధానం పొందవచ్చు.

మూడవ ప్రత్యేకత

మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా ఉచితం